హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అ. కలెక్టర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని, విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని గుత్తేదారును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో MRO రాఘవేందర్ రెడ్డి, MPDO లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.