హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళ్లపేట్‌లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

MNCL: దండేపల్లి మండలంలోని తాళ్ల పేట్‌లో బుధవారం లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కుర్సెంగ కళావతి, ఉప సర్పంచ్ పుట్టపాక తిరుపతి కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కంది సతీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి స్వరూప, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.