హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి: కలెక్టర్

NZB: ఇందల్వాయిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణను మరింత మెరుగుపరచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.