KMM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ లాల్మియా బుధవారం పిలుపునిచ్చారు. తల్లాడపార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రజా గర్జన సభను జయప్రదం చేయాలన్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పోడు భూములకు పట్టా ఇవ్వాలి: సీపీఐ


