ఆస్ట్రేలియాతో అడిలైడ్ వన్డేలో సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్ టామ్ బాంటన్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారీగా దూసుకెళ్లాడు. కేవలం 99 బంతుల్లో 121 పరుగులు చేసిన బాంటన్ ఏకంగా 34 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరుకున్నాడు. కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్ సాధించాడు. మరోవైపు జో రూట్ తొమ్మిదో స్థానానికి చేరగా, జోఫ్రా ఆర్చర్ బౌలర్ల జాబితాలో ఏడో ర్యాంకును అందుకున్నాడు.
క్రీడలు
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్!


