హైదరాబాద్: 28°C
క్రైమ్

గంజాయి ముఠా గుట్టురట్టు 

TG: హైదరాబాద్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు అయింది. ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్లను ఈగల్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. 1.24 కిలోల గంజాయి, 16.59 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. స్నాప్‌చాట్ ద్వారా గంజాయి, ఓజీ కుష్ విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. ముంబైకి చెందిన షేక్ ఫర్హాన్ నుంచి కొనుగోలు చేశారు. దీంతో ఫర్హాన్ కోసం గాలిస్తున్నారు.