TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జాతీయ రహదారిపై దర్గా చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు ధ్వంసం కాగా, వెంకట్ దంపతులకు ప్రాణాపాయం తప్పింది. ఎమ్మెల్సీ సోదరుడు చాణక్య, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.
క్రైమ్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం


