రష్యాలోని కెమెరోవో సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యా సైన్యానికి చెందిన రవాణా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 17 మంది మరణించారు. గాలిలో ఉండగానే మంటలు చెలరేగడంతో విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టి పేలిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
ఘోర విమాన ప్రమాదం.. 17 మంది మృతి


