హైదరాబాద్: 28°C
క్రైమ్

రోకలిబండతో కొట్టి తల్లిని చంపిన కుమారుడు

TG: మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం శివయ్యపల్లిలో దారుణం జరిగింది. డబ్బుల విషయంలో తల్లితో గొడవపడి తలపై కుమారుడు రోకలిబండతో కొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.