హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తపేటలో ఉచిత వైద్య శిబిరం

JGL: రాయికల్ మండలం కొత్తపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 65 మంది పరీక్షలు చేయించుకోగా, 15 మందిలో ఆరోగ్య సమస్యలు బయటపడ్డాయి. వారికి వైద్య సూచనలు అందించారు. ముందస్తు పరీక్షలే ఆరోగ్య రక్షణ అని అధ్యక్షులు వాసం ప్రసాద్ అన్నారు. సర్పంచ్ మీనుగు అంజయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.