హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ బీజేపీ నేతల అరెస్టు.. స్టేషన్‌కు తరలింపు

PDPL హైదరాబాద్ వెళ్తున్న ఎలిగేడు మండల బీజేపీ నేతలను పోలీసులు మంగళవారం అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. భారత్ సమ్మిట్ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు వెళ్తున్న గాదె రంజిత్ రెడ్డి, అమరగొండ గంగయ్య, కోడూరు శ్రీనివాస్, మనోహర్, వేణు, రాకేష్‌లను ముందస్తు అరెస్ట్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుతో బయలుదేరామని నేతలు అన్నారు.