హైదరాబాద్: 28°C
వార్తలు

పిచ్చిమొక్కలతో డబుల్ బెడ్ రూమ్‌లు

JN: పాలకుర్తి మండలం రాఘవపురంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ ఇళ్లు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. నిలువనీడ లేని పేదలు అందులోనే ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పెండింగ్ పనులను పూర్తి చేసి అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.