హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీని వీడి టీడీపీలో చేరిన జేబీకేపురం మాజీ సర్పంచ్

ప్రకాశం: బేస్తవారిపేట మండలం జేబీకేపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య సోమవారం తన అనుచరులతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.