హైదరాబాద్: 28°C
క్రైమ్

యాపిల్ లారీ బోల్తా.. సంచుల్లో ఎత్తుకెళ్లిన ప్రజలు

TG: మహబూబాబాద్ జిల్లాలోని మాటేడులో యాపిల్ పండ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ట్రక్కు కందకంలో పడిపోవడం, ఆపిల్ పెట్టెలు నేలపై చెల్లాచెదురుగా పడటం చూసిన ప్రజలు, ఆ పండ్ల కోసం ఎగబడటంతో నిమిషాల వ్యవధిలోనే మొత్తం లోడు ఖాళీ అయిపోయింది. పురుషులు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా సంచులు, సంచులతో పండ్లను తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.