హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రదోష వేళ ప్రత్యేక అలంకరణలో మార్కండేశ్వర స్వామి

ప్రకాశం: కార్తీక మాసం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రదోష కాలంలో స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్య అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.