హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు'

PLD: వినుకొండ(M) దొండపాడులో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడి నామినేషన్ పత్రాలు చించివేశారని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అభ్యర్థులు బెదిరింపులకు లొంగకుండా నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చారు.