BPT: పిట్టలవానిపాలెం కేర్ హైస్కూల్‌లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. చందోలు ఎస్సై కే. మాధవరావు పాల్గొని సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, రహదారి భద్రతా నియమాలు పాటించాలన్నారు.
వార్తలు
పిట్టలవానిపాలెంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన


