హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకుఅంతరాయం

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆలేరు ఏడీఈ పీర్యా నాయక్ తెలిపారు. యాదగిరిగుట్ట టెంపుల్ సబ్‌స్టేషన్ మరమ్మతుల కారణంగా పాతగుట్ట, ప్రశాంతనగర్, యాదవ్నగర్, యాదగిరిపల్లి ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.