హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NZB: నగరంలో విద్యుత్ నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని టౌన్-3 ADE వినోద్ తెలిపారు. విశాల్ మార్ట్ ఏరియా, ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఏరియా, జాకీ షోరూం, NZB చికెన్ సెంటర్ ఏరియా, రామరాజు కాటన్, ఐఓబీ బ్యాంక్ ఏరియా, ఆకాష్ బైజూస్ ఏరియా ప్రాంత వాసులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.