హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 14,500 కొత్త పింఛన్లు: కలెక్టర్

ADB: జిల్లా వ్యాప్తంగా సుమారు 14,500 కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఒక్క సిరికొండ మండలంలోనే 4,500 పింఛన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. మారుమూల ప్రాంతాలు, పీవీటీజీ గ్రామాల్లోని దివ్యాంగులకు ప్రత్యేక రిమ్స్ వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో పాటు పింఛన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.