కాకినాడ: ఏలేరు రిజర్వాయర్‌కు వరద కొనసాగుతోంది. బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 280.97 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటిమట్టం 284 అడుగులు కాగా, ప్రస్తుతం 22.246 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో సగటున 1,359 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 200, డీసీఆర్‌కు 600, స్పిల్ వే ద్వారా 1,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏలేరు రిజర్వాయర్‌కు కొనసాగుతున్న వరద


