కోనసీమ: రాజోలు మండలం శివకోటి గ్రామంలోని ముసలమ్మ ఆలయం సమీపంలో తాగునీటి పైప్‌లైన్ కోసం తవ్విన గుంతలో అల్యూమినియం లోడుతో వెళ్తున్న లారీ మంగళవారం సాయంత్రం దిగబడింది. లారీలోని లోడును కిందకు దించి జేసీబీ సహాయంతో పలుమార్లు లాగినా ప్రయోజనం లేకపోవడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి పైప్‌లైన్ గుంతలో దిగబడిన లారీ


