హైదరాబాద్: 28°C
క్రీడలు

కేకేఆర్ యాజమాన్యంలో మార్పులు!

ఐపీఎల్‌ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కీలక మార్పు చోటుచేసుకోనుంది. సహ యజమాని జే మెహతా తన 45 శాతం వాటాలో సగమైన 22.5 శాతాన్ని అమెరికాకు చెందిన ఆరెస్ మేనేజ్‌మెంట్ సంస్థకు విక్రయించనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.3,739 కోట్లు. దీంతో కేకేఆర్ విలువ రూ.16,634 కోట్లకు చేరనుంది. అయితే ఈ విక్రయానికి బీసీసీఐ అధికారిక ఆమోదం తప్పనిసరి.