IPLకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీతో ఉన్న అనుబంధంపై రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. 'అద్భుతమైన ఐపీఎల్ ప్రయాణం సాగించిన ధోనీకి శుభాకాంక్షలు. ధోనీ భాయ్.. నీతో కలిసి మైదానంలో, బయట కలిసి పంచుకున్న జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. నీపై ఉండే గౌరవం ఎప్పటికీ తగ్గదు' అని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
క్రీడలు
ధోనీపై రోహిత్ శర్మ ఎమోషనల్ పోస్ట్


