ఢిల్లీలో వాయు నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. దీంతో ప్రభుత్వం GRAP III ఆంక్షలను ఎత్తివేసింది. ప్రస్తుతం నగరంలో గాలి నాణ్యత సూచీ(AQI) 220 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు కుదుటపడుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రానున్న రోజుల్లో గాలి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తామని, పరిస్థితికి తగిన నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
వార్తలు
ఢిల్లీలో మెరుగుపడిన వాయు నాణ్యత


