హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగు మండలాలకు టీడీపీ విప్‌లు

KKD: రేపు జరగనున్న ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాలకు టీడీపీ విప్‌లను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. జగ్గంపేటకు కోడూరి సత్యనారాయణ, గండేపల్లికి పెదపాటి శుభాకర్, కిర్లంపూడికి గోడే లక్ష్మీ తులసి, గోకవరానికి సత్యం వెంకటేశ్వరరావు (పెద్దబ్బులు)లను నియమించి నియామక పత్రాలు అందజేశారు.