హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్ పత్రాల పంపిణీలో మంత్రి పొన్నం

HNK: ముల్కనూరులో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. భీమదేవరపల్లిలో కొత్తగా 837 చేయూత పింఛన్లు మంజూరు చేశామని, అర్హత ఉండి గతంలో పింఛన్ పొందలేకపోయిన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా పింఛన్లు అందిస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు అని అన్నారు.