హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాన్సర్ బాధితుడికి రూ.5 లక్షల ఎల్‌వోసీ మంజూరు

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారేడ్పల్లికి చెందిన మహమ్మద్ ముజఫరుద్దీన్ క్యాన్సర్ చికిత్స కోసం ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను సంప్రదించారు. స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షల ఎల్‌వోసీ మంజూరు చేయించారు. పికెట్లోని క్యాంపు కార్యాలయంలో బాధితుడికి మంజూరు పత్రాన్ని అందజేశారు.