GDWL: మల్దకల్లో రూ.48 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. ఇందులో రూ.30 లక్షలతో వ్యవసాయ గోదాము, రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం, రూ.8 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం పైపులైన్ ద్వారా తాగునీటి సరఫరాను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
మల్దకల్లో రూ.48 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ


