MHBD: తొర్రూరు మండలం కంటాయపాలెం రైతువేదికలో బుధవారం పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాంనర్సయ్య మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి భూగర్భ జలాలు తగ్గుతున్నందున యాసంగిలో వరి సాగు తగ్గించాలన్నారు. పెసర, మినుము, జొన్న, వేరుశెనగ, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు.
తెలంగాణ
‘ఆరుతడి పంటలే వేయాలి’


