హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనింగ్ మృతులపై అధికారుల విచారణ

NLG: దేవరకొండ మండలం వెంకట్ తండా సమీపంలో మైనింగ్ పనుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధితుల సమస్యలపై గ్రామసభ నిర్వహించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటావత్ హుస్సేన్ నాయక్ ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వారి తరఫున బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కళ్యాణ్ నాయక్ ఆర్డీవో వనజాక్షికి వినతిపత్రం అందజేశారు.