ADB: యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్ లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. యువత పోటీతత్వాన్ని అలవర్చుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి: కలెక్టర్


