హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతలమయంగా రహదారి.. ఇబ్బందుల్లో వాహనదారులు

TPT: మండల కేంద్రమైన ఓజిలి నుంచి కురుగొండకు వెళ్లె రోడ్డుపై బత్తాలాపురం వద్ద పెద్ద పెద్ద గుంటలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై నిత్యం ఆటోలు, కార్లు, ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. గుంతల రోడ్డుతో వాహనాలు త్వరగా మరమ్మతులకు గురౌతున్నాయని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.