హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

AITUC జాతీయ మహాసభలను విజయవంతం చేయండి

కడప: కార్మిక హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు బెంగళూరు వేదికగా ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ కడప జిల్లా సమితి వెల్లడించింది. ఈ మేరకు కడప ప్రెస్ క్లబ్‌లో మహాసభల బ్రోచర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని కడప జిల్లా సమితి పిలుపునిచ్చింది.