హైదరాబాద్: 28°C
వార్తలు

సోనియా పుస్తకాన్ని చింపేసిన శివసేన నేతలు

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుస్తకంపై ముంబైలో శివసేన పార్టీ నేతలు షైనా ఎన్సీ, సంజయ్ నిరుపమ్, ఆనంద్ దూబే తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ పుస్తకంలో చరిత్రను వక్రీకరించారని, వీర సావర్కర్‌ను కించపరిచేలా రాశారని మండిపడ్డారు. నిరసనలో భాగంగా పుస్తకం పేజీలను చించేశారు. 201, 443 పేజీల్లోని అభ్యంతరకర వాక్యాలను వెంటనే తొలగించాలని హార్పర్ కాలిన్స్ పబ్లిషర్స్‌ను డిమాండ్ చేశారు.