KNR: శంకరపట్నం మండల పరిధిలో 600 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన చేయూత పింఛన్ పత్రాలను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. అలాగే, 200 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకాల ద్వారా ఆర్థిక భరోసా, ఆవాసం కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
పింఛన్, ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ


