హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటీ రోడ్డు పనులు ప్రారంభం

MNCL: చెన్నూరు మండలం కన్నేపల్లి నుంచి బుద్దారం గ్రామాల మధ్య రూ.90 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను బుధవారం మంత్రి వివేక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కన్నేపల్లి, సంకారం బుద్దారం గ్రామస్తుల కష్టాలకు ఈ రోడ్డు నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యమన్నారు.