హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ మట్టి రవాణా.. డ్రైవర్ పరారీ

BDK: బూర్గంపాడు మండలం జింకలగూడెం సీతారామ ప్రాజెక్టు కాలువ నుంచి పాల్వంచకు అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా వాహనాన్ని అడ్డుకోగా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారైన డ్రైవర్, వాహన యజమాని కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.