హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల సరిహద్దుల్లో పులి సంచారం

AP: ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. విస్సన్నపేట మండలం కొండపర్వ శివారు రమణక్కపేట అటవీ ప్రాంతంలో పులి సంచారిస్తోంది. పెద్దపులి సంచారంపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందగా.. పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు మైకుల ద్వారా ప్రచారం చేపట్టారు.