హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే కృషితో బాధితుడికి ఆర్థిక చేయూత

MDK: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చొరవతో రామాయంపేట మండలం సుతార్‌పల్లికి చెందిన బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.20 వేల చెక్కును సర్పంచ్ మద్దూరి సునీల్ అందజేశారు. పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసాగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామ అధ్యక్షుడు పాల్గొన్నారు.