హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.3.33 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

SRD: పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్లలో ప్రభుత్వ నిధులు, సీఎస్‌ఆర్ సహకారంతో చేపట్టనున్న రూ.3.33 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.