హైదరాబాద్: 28°C
తెలంగాణ

కటికెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

PDPL: ధర్మారం మండలం కటికెనపల్లిలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం నర్సమ్మ గ్రామ సర్పంచ్ చేపూరి లచ్చయ్యతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ప్రైవేటు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఉప సర్పంచ్ బోనగిరి అజయ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లావుడ్య రూప్లానాయక్, వర్డ్ సభ్యులు పాల్గొన్నారు.