హైదరాబాద్: 28°C
తెలంగాణ

నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

KMM: రఘునాథపాలెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో నైట్ వాచ్ ఉమెన్ పోస్టు-1 ఖాళీగా ఉందని బుధవారం ఎంఈవో బి.రాములు తెలిపారు. కనీసం ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి. ఆసక్తి ఉన్న వారు సంబంధిత ధ్రువపత్రాలతో కేజీబీవీ రఘునాథపాలెంలో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు అందజేయాలని ఎంఈవో కోరారు.