BHNG: రాజాపేట మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సామాజికవేత్త జెల్ల పరమేశ్ రూ.40 వేల విలువైన క్రీడా దుస్తులను బుధవారం అందజేశారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ సహాయం చేశారు. వారంలో బుధ, శనివారాల్లో వీటిని ధరించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం జి.శోభ, ఏఏపీసీ ఛైర్మన్ గోనే లావణ్య, సర్పంచ్ ఇండ్ల అనూష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులను ప్రోత్సహించిన దాత


