నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారం, మున్సిపల్ పన్నుల చెల్లింపులను సులభతరం చేసేందుకు పురమిత్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను యాప్ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చని అన్నారు. ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఆన్లైన్లో చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు నగర ప్రజలకు కీలక సూచన


