GNTR: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ సభ్యులు కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఈ భేటీ జరిగింది. ఈ నెల 28న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో జాతీయ స్థాయి నిరసన చేపట్టనున్నారు. 'చలో రాంలీలా మైదాన్' కార్యక్రమానికి స్వయంగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ పోరాటానికి మద్దతు, సంఘీభావం తెలపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌తో కులగణన కమిటీ సభ్యుల భేటీ!


