NDL: డోన్ పట్టణంలోని 22వ వార్డు సీపీఐ కౌన్సిలర్‌గా రెండోసారి ఎన్నికైన పి. సుంకయ్యకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక నక్కి రామన్న భవనంలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు సుంకయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్, ఏఐటీయూసీ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డోన్‌లో కౌన్సిలర్ సుంకయ్యకు ఘన సత్కారం


