PPM: కొమరాడ మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను టీడీపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు మండల పార్టీ కన్వీనర్ శేఖర్ పాత్రుడు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఈ పదవులను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఎంపీపీ అభ్యర్థిగా మాదిలింగి ఎంపీటీసీ జలుమూరు లక్ష్మణరావును, వైస్ ఎంపీపీ అభ్యర్థిగా చోళపదం ఎంపీటీసీ బిడ్డక దమయంతిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల ఖరారు..!


