హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామిరెడ్డిపల్లెలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత

KDP: వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లెలో నామినేషన్ల ప్రక్రియ రణరంగంగా మారింది. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల దాఖలు సందర్భంగా టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు దిగడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు.