హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్డు నిర్మించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం'

ASR: అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ పరిధిలోని పందిరిమామిడి, నక్కలమామిడి,కోడితాల గ్రామాల ప్రజలు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆసుపత్రికి వెళ్లాలన్నా,నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్నా ఇదే మార్గంలో ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రోడ్డు నిర్మించకపోతే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.